మాకు న్యాయం చేయండి
గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది నిర్వాకంతో తాము మోసపోయామని, అధికారులు న్యాయం చేయాలని 40 మందికిపైగా కరీంనగర్ రూరల్ మండల చేగుర్తి గ్రామ మహిళలు వేడుకున్నారు.
- స్త్రీనిధి సొమ్ము స్వాహా ఉదంతంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- చేగుర్తి మహిళల ఆందోళన
- డీఆర్డీఏ కార్యాలయం ఎదుట బైఠాయింపు
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 11 : గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది నిర్వాకంతో తాము మోసపోయామని, అధికారులు న్యాయం చేయాలని 40 మందికిపైగా కరీంనగర్ రూరల్ మండల చేగుర్తి గ్రామ మహిళలు వేడుకున్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట మూడు గంటలపాటు బైఠాయించి ఆందోళన చేశారు. కార్యాలయంలోకి రాకపోకలను అడ్డుకున్నారు. స్త్రీనిధి సొమ్ము స్వాహా ఉదంతంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారుల చుట్టూ కాళ్లారిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
30 లక్షల కుంభకోణాన్ని తమపైకి నెట్టి డీఆర్డీఏ సిబ్బంది చేతులు దులుపుకున్నారని, దీంతో స్త్రీనిధి అధికారులు తమ ఇండ్లకు వస్తున్నారని ఆవేదన చెందారు. పది రోజుల క్రితం కూడా తాము డీఆర్డీవోను కలిసి తమ గోడు వెళ్లబోస్తే, వారంలో సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారని, పదిరోజులు గడుస్తున్నా పరిష్కారం కాలేదని, డీఆర్డీవో వచ్చేదాకా కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. అధికారుల నిర్లక్ష్యమే వేధింపులకు కారణమని, నిధులు స్వాహా చేసిన గ్రామ వీవోతో లిఖిత పూర్వక పత్రం రాయించుకున్నా, తమను వేధింపులకు గురిచేయడం వెనుక అధికారుల పాత్ర ఉందని ఆరోపిస్తూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.
నిత్యం కూలీ పనులకు వెళ్తేనే తమ కుటుంబం గడిచే పరిస్థితులు ఉండగా, సమస్య పరిష్కరించాలంటూ పదిహేను రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరి నాట్ల సీజన్లో తాము రోజూ కూలి 300 కోల్పోతున్నామని, అధికారులు తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో మూకుమ్మడిగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు కరీంనగర్ మండల ఏపీఎంను మహిళలు చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. దీంతో, ఆయన ‘ఉన్నతాధికారి వద్ద కెళ్లి మీ సమస్య చెప్పుకోండి. నా చేతుల్లో ఏమి లేదు’ అని తేల్చిచెప్పారు. ప్రధాన ద్వారం ఎదుట సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7.30గంటల వరకు బైఠాయించి ఆందోళన చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

