Dharmaram | వర్గీకరణలో నేతకానీలకు జరిగిన అన్యాయంపై నవంబర్ 15న చలో ఉస్మానియా.. ప్రోగ్రాం కన్వీనర్ రాష్ట్ర అధ్యక్షుడు, నేతకాని విద్యార్థి సంఘం సాయిని ప్రసాద్ నేత
రాష్ట్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈఅన్యాయం పట్ల నవంబర్ 15న హలో నేతకాని - చలో ఉస్మానియా కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు ప్రోగ్రాం కన్వీనర్ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత తెలిపారు.
Dharmaram | ధర్మారం, అక్టోబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈఅన్యాయం పట్ల నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు ప్రోగ్రాం కన్వీనర్ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత తెలిపారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమ విజయవంతం చేయడానికి పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నేతకాని కుల సంఘం మండల అధ్యక్షులు రాగుల మల్లేష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సన్నాక సమావేశానికి ప్రసాద్ నేత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో నేతకాని సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని వివరించారు.
ప్రభుత్వాలు స్పందించే విధంగా తమకు న్యాయం జరిగే దిశగా కార్యక్రమాలు చేపడుతూ నేతకాని సమాజాన్ని చైతన్య పరిచి ఉద్ధృతంగా ఉద్యమాలు నిర్వహించబోతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా హలో నేతకాని చలో ఉస్మానియా కార్యక్రమానికి ధర్మారం మండల నేతకానికుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తద్వారా చైతన్యవంతమై భవిష్యత్తు ఉద్యమాలకు పాటుపడాలని కోరారు. 2002లో చేపట్టిన ఎస్సీ కులాల వర్గీకరణ ఏబిసిడి గ్రూపులుగా విభజించారని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2024 వర్గీకరణలో 1,2, 3 గ్రూపులుగా ఎందుకు విభజించారో తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ప్రశ్నించారు. ఇలాంటి అనేక అంశాలను చలో ఉస్మానియాలో చర్చించబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాస్, కో కన్వీనర్ జాడి గంగాధర్, ధర్మారం మండల అధ్యక్షుడు రాగుల మల్లేష్, సీనియర్ నాయకులు గోగు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

