Registration number plate | రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ దాచినా, నంబర్లు తొలగించినా కేసులు నమోదు.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ దాచినా, నంబర్లు తొలగించినా కేసులు నమోదు చేస్తామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి, కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో తనిఖీ చేపట్టారు.
- నంబర్ ప్లేట్స్ సరిగా లేని 306 వాహనాలను సీజ్
Registration number plate | జగిత్యాల : రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ దాచినా, నంబర్లు తొలగించినా కేసులు నమోదు చేస్తామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి, కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 306 వాహనాలను సీజ్ చేశారు. కాగా నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నంబర్ ప్లేట్లను బిగించిన తర్వాత వాహనాలను విడిచి పెట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారీతిన వాహన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ-చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయని, కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు. ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ యొక్క తనిఖీలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని, కావున జిల్లా పరిధిలోని ప్రజలందరూ పోలీస్ వారికీ సహకరించలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

