Indiramma illu | ముగ్గు పోయలే.. పునాదులు తవ్వలే..|
Indiramma illu | కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశించినా, ఇళ్ళ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కానరాని ప్రగతి
పసులు ప్రారంభించాలంటూ ఒత్తిడి
చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న లబ్ధిదారులు - జిల్లాలో 2027 మంది లబ్ధిదారుల ఎంపిక
Indiramma illu | కరీంనగర్, కలెక్టరేట్, ఏప్రిల్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశించినా, ఇళ్ళ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఎంపిక చేసిన వారిలో మూడో వంతు లబ్ధిదారులకు కూడా ఇళ్ళ నిర్మాణాలకు మార్కింగ్ చేయకపోగా, చేసిన వారిలో ఇరవై శాతం కూడా బేస్మెంట్ స్థాయికి చేరకపోవటం ఆందోళనకర పరిణామంగా మారింది. దీంతో అధికారులు పైలెట్ గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, లబ్ధిదారులతో నిర్మాణపనులు మొదలు పెట్టించేందుకు అపసోపాలు పడుతున్నారు.
ఈ పథకంలో భాగంగా నిలువనీడలేని నిరుపేదల కోసం ముందుగా డబ్బులిచ్చి ఇళ్ల నిర్మాణం చేపడుతామంటూ అనేక సభల్లో పదేపదే నొక్కివక్కానించిన అధికార నేతలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనే ప్రహసనంగా సాగించారు. ఏడాది అనంతరం మండలానికో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, గ్రామంలోని లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు కూడా అందజేశారు. అయితే, వీరిలో అత్యధికమంది సొంతిల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి ప్రదర్శించటం లేదు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఏరోజుకారోజు పెరుగుతున్న నిర్మాణ సామాగ్రి ధరలు, ఇంకోవైపు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న వైనం వెరసి లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించటం లేదని తెలుస్తోంది.
ఫైలెట్ గ్రామాల్లో 2027 మంది లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలోని 15 మండలాలకు చెందిన ఎంపిక చేసిన15 గ్రామాల్లో 2027 మందిని లబ్ధిదారులుగా అధికారులు ప్రకటించారు. వీరందరిని ఇండ్లు నిర్మించుకోవాలంటూ గత నెలలోనే ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనులను బట్టి వీరికి నిధులు విడుదల చేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు కూడా లబ్దిదారుల నుంచి తీసుకున్నారు అయితే, లబ్దిదారుల్లో ఇప్పటివరకు 780 మంది మాత్రమే ఇళ్ళు నిర్మాణాలకు మార్కింగ్ చేసుకోగా, వారిలో 114 మంది మాత్రమే పునాదులు తీసి, బేస్మెంట్ స్థాయికి చేర్చారు.
మిగతా వారు ఇంకా పిల్లర్ల గోతులు కూడా తీయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కువ మంది లబ్ధిదారులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కావటం, దీనికితోడు వరికోతలు ఇపుడిప్పుడే ప్రారంభమవుతుండగా హార్వేస్టర్, ఇతర అవసరాలకు చేతిలో ఉండే డబ్బు ఖర్చు చేస్తున్నారు. దీంతో, ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ముడిసరుకులు తెచ్చేందుకు డబ్బులేక వాటిపై దృష్టి సాధించటం లేదని తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనైనా పనులు ప్రారంభించాల్సిందేనంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో చేతిలో రూపాయి కూడా లేకుండా పనులు ఎలా మొదలు పెట్టేదంటూ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళే తమను లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నట్లు అధికారులు వాపోతున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అంతగా పురోగతి కనిపించకపోవటంతో, యంత్రాంగంపై ఉన్నతాధికారులు చిర్రుబుర్రులాడుతుండగా, వీరు కిందిస్థాయి సిబ్బందిపై చిటపటలాడుతున్నట్లు అధికారవర్గాల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం దశలవారీగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుండగా, మొదటి దఫాగా బేస్మెంట్ స్థాయికి చేరుకున్న ఇళ్ళకు రూ.లక్ష అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు లబ్ధిదారులకు స్పష్టం చేస్తున్నా, తమ మాటలు పట్టించుకోవటంలేదని పేరు చెప్పడానికి ఇష్టం లేని ఓ అధికారి పేర్కొంటుండటం గమనార్హం.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

