Murder | గంగాధరలో వృద్ధురాలి దారుణ హత్య
గంగాధర మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలి దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలు ఈనెల 16వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
murder | గంగాధర, ఆగస్టు 20 : గంగాధర మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలి దారుణ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు గంగాధర మండల కేంద్రానికి చెందిన పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలు ఈనెల 16వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో మల్లవ్వ కుటుంబ సభ్యులు గంగాధర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వృద్రాలు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. గంగాధర మండలం నాగిరెడ్డి పూర్ గ్రామానికి చెందిన గంగరాజు అనే యువకుడి సూచన మేరకు కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన దేవునూరి సతీష్, దేవనూరి శ్రావణ్ అనే యువకులు మల్లవ్వను కిడ్నాప్ చేసి గంభీరావుపేట శివారులోని పెద్దమ్మ స్టేజి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వృద్ధురాలు మల్లవ్వను హత్య చేసి ఆమెపై ఉన్న ఆభరణాలను దోచుకుని, శవాన్ని చెత్తకుప్పలో పడవేసి వెళ్ళిపోయారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులు దేవునూరి సతీష్, దేవనూరి శ్రావణ్ ను పోలీసులు అరెస్టు చేసి వారి నుండి స్విఫ్ట్ డిజైర్ కారు, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దేవనూరి సతీష్ పై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు, కొట్లాట కేసు నమోదై విచారణలో ఉన్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు గంగరాజు, మరికొందరు సహచరులు పరారీలో ఉన్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గంగరాజు దొరికితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై వంశీకృష్ణ, పోలీసు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

