Sultanabad | సుల్తానాబాద్, ఆగస్టు 6 : సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో గురువారం బోనాల పండుగను విద్యార్థులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా భావించే బోనాల పండుగను ఆషాడమాసంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి కుటుంబం సుఖ సంతోషాలు, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తారని తెలిపారు. గతంలో హైదరాబాదుకు పరిమితం అయిన బోనాల పండుగకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు.
మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో, అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయాలకు తీసుకెళ్తారని, పోతరాజు నృత్యాలు, డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ అన్నారు. రాష్ట్ర ప్రజలందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్తుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు తెలిపేందుకే పాఠశాలలో ప్రతిఏటా బోనాలను నిర్వహించి విద్యార్థులను చైతన్య చైతన్య పరుస్తున్నామన్నారు. పోతరాజు, అమ్మవారి వేషధారణలో విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.