Palakurthi | పాలకుర్తి : పాలకుర్తి మండలం రాజీవ్ తండా లో సేవాలాల్ మహారాజ్, జగదాంబ ఆలయానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి లంబాడీల ఆరాధ్య దైవం పూజారి శేఖర్ మహారాజ్ మహారాష్ట్ర నుంచి హాజరయ్యారు. సేవాలాల్ మహారాజ్ ఆలయం, జగదాంబ ఆలయాలకు శేఖర్ మహారాజ్ గురువు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు భక్తి తో చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం తండా ప్రజలకు ఇస్లావత్ వనితశంకర్ అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీను బాబు, మాజీ ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్, తండా సర్పంచ్ అఖిల అంజీ నాయక్ , ఉపసర్పంచ్ రాజేశ్వరి సారయ్య, నాయకులు సూర సమ్మయ్య, నూగిళ్ల మల్లయ్య, అసంపల్లి శ్రీనివాస్, తండా నాయకులు కెల్డన్ నాయక్, సారయ్య, శక్లల్, శ్రీనివాస్, సమ్మయ్య, తిరుపతి, పులచంద్, గట్టయ్య, చందు, రాజు, శ్రీను, తిరుపతి, సమ్మయ్య, సురేష్, రమేష్, జగన్, కిరణ్, నగేష్, నరేష్, చిన్న, సమ్మయ్య, మహిళలు యువకులు పాల్గొన్నారు.