Vaibhav | వైభవ్ సూర్యవంశీ తన సహజమైన ఆటనే కొనసాగించాలి : రవిచంద్రన్ అశ్విన్
Vaibhav | భారత్ నయా సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే(,Vaibhav Suryavanshi )ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా ఉంది.
Vaibhav | భారత్ నయా సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే(,Vaibhav Suryavanshi )ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా ఉంది. 15 ఏళ్ల ఈ కుర్రాడు భారత క్రికెట్ జట్టులోకి ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇండియా ఐర్లాండ్, ఇంగ్లాండ్ల సిరీస్లలో తలపడనున్న నేపథ్యంలో ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin) కీలక వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయస్సులోనే సంచలన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ పై అంచనాల భారం ఎక్కువగా ఉందని, వాటిని పక్కన పెట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా తన ఆటను ఆస్వాదించాలని అశ్విన్ సూచించాడు.
భారత జట్టు తరపున ఆడే అవకాశం వచ్చినప్పుడు ఆటను ఆస్వాదించాలన్నారు. తన సొంత ఊరి వీధుల్లో ఆడుకున్నట్లుగానే, ఈ ఆటను కూడా ఆస్వాదించాలని అశ్విన్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటప్పుడు అతడిపై అంచనాలు, ఒత్తిడి రావడం సహజమని, అయితే వీలైనంత వరకు వాటిని దూరం పెట్టాలని సూచించాడు.
వైభవ్ ఇటీవల ‘ఇండియా ఎ’ (India A) తరపున శ్రీలంకలో ముక్కోణపు సిరీస్లో అద్భుతంగా ఆడాడు. అందులో ఫైనల్ మ్యాచ్లో విజయంలో కీలక పాత్ర పోషించే ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు. అతను ప్రత్యేకమైన ఆటగాడని పొగడ్తలతో ముంచెత్తాడు. వైభవ్ విషయంలో కేవలం దూకుడైన బ్యాటింగ్ శైలి మాత్రమే కాదు, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉందన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

