Best Award | చందుర్తి, జూలై 13 : చందుర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గుడిసె విజయ్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా ఈ అవార్డును విజయ్ చైర్మన్ ప్రతాప రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో అందుకున్నారు. 949శాఖల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు ఉత్తమ సేవలు రైతులకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణ సౌకర్యాలతో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకుతో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. అవార్డుకి ఎంపికైన మేనేజర్ విజయ్ ని పలువురు అభినందించారు.