Chigurumamidi | చిగురుమామిడి, మే 28 : చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బోమ్మనపల్లి, నవాబ్ పేట్, ముదిమాణిక్యం,ఇందూర్తి, ముల్కనూర్ తదితర గ్రామాల్లో ఈద్గా ల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఆత్మీయులకు స్వీట్లు పంపిణీ చేశారు.
సర్వ మత సౌభ్రాతృత్వానికి ప్రతీక బక్రీద్ పండుగ నిలుస్తుందని అన్నారు. తెల్లవారుజామునే ముస్లిం సోదరులు కొత్త బట్టలు ధరించి ఒకరికి ఒకరు ఆత్మీయ అలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు ఎండి సర్వర్ పాషా, ఎస్ కె సిరాజ్, మక్బూల్ పాషా, షరీఫ్, హమీద్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ముస్లిం సోదరులకు బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.