సంక్షేమంలో మన రాష్ట్రం ఆదర్శం
సీఎం కేసీఆర్ విజన్ గొప్ప నాయకుడని, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిపారని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కొనియాడారు. ఓదెల మండలం కొలనూర్‌లో సబ్సిడీ గొర్రెల పథకం కింద రెండో విడత యూనిట్ పొందిన బావు రాములు యాదవ్ ఇంటికి మంగళవారం ఆకస్మికంగా వచ్చారు.
- కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు
- కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపాడు
- గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు
- కొలనూర్‌లో గొర్రెల లబ్ధిదారుడి ఇంటికి ఆకస్మికంగా రాక
ఓదెల, సెప్టెంబర్ 19: సీఎం కేసీఆర్ విజన్ గొప్ప నాయకుడని, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిపారని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కొనియాడారు. ఓదెల మండలం కొలనూర్‌లో సబ్సిడీ గొర్రెల పథకం కింద రెండో విడత యూనిట్ పొందిన బావు రాములు యాదవ్ ఇంటికి మంగళవారం ఆకస్మికంగా వచ్చారు. గొర్రెలు ఎలా ఉన్నాయి..? గొర్రెల పథకంపై లబ్ధిదారుల అభిప్రాయం ఎలా ఉంది..? అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రాములు యాదవ్ మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ పేద యాదవులకు బతుకును నిలబెట్టిందని, చాలా గొప్ప పథకమని, సీఎం కేసీఆర్ వచ్చినంక భరోసా దొరికిందని చెప్పాడు. ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు తన ఇంట్లో చైర్మన్‌తో పాటు యాదవ సంఘ నాయకులకు భోజనం పెట్టి అతిథ్యమిచ్చాడు. లబ్ధిదారుడి ముఖంలో సంతోషాన్ని చూస్తే ఆనందంగా ఉందని బాలరాజు పేర్కొన్నారు.
కులవృత్తులకు అండగా ప్రభుత్వం: బాలరాజు
సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్టాన్ని తేవడమేకాదు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తీసుకువచ్చారని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదరణ కోల్పోతున్న కుల వృత్తిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా ఉద్ఘాటించారు. బీసీ, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, మ హిళల ఆరోగ్యం ఇలా.. చెప్పుకుంటూపోతే అనేక పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. కొలనూర్‌కు వచ్చిన చైర్మన్‌ను పశువైద్యాధికారులు మౌనిక, కుమారస్వామి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట యాదవ సంఘ నాయకులు తమ్మడబోయిన ఓదెలుయాదవ్, పెగడ రమేశ్‌యాదవ్, మేకల మల్లేశంయాదవ్, దారబోయిన నర్సింహయాదవ్, ఉపసర్పంచ్ పాకాల సంపత్‌రెడ్డి, కూకట్ల నవీన్‌యాదవ్, కాశవేని నరేష్‌యాదవ్, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, కొలనూర్, ఓదెల పశువైద్యాధికారులు మౌనిక, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఇచ్చిన గొర్రెలతోనే బతుకు సాగుతుంది..
సీఎం కేసీఆర్ ఇచ్చిన గొర్రెలతోనే నా కుటుం బం బతుకుతుంది. మాది పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు. గతంలో నేను జీతానికి ఉండి బతికిన. చాలా ఇబ్బందులుపడ్డ. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి కానీ మమ్ముల ఎవలూ ఆదుకోలె. కానీ గిప్పుడు కేసీఆర్ సార్ దయతో మళ్లీ సొంతంగా గొర్రెలు పెంచుకుంటున్న. సార్‌కు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్న.
– బావు రాములు యాదవ్, లబ్ధిదారుడు, కొలనూర్ (ఓదెల)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

