నేటి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోతవాలు
దేవాదాయ ధర్మధాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు కమాన్ రోడ్డులో గల శ్రీమద్విరాట విశ్వకర్మ భగవానుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సర్వంగా సుదరంగా ముస్తాబు చేశారు.
- దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
- నేడు బైక్ ర్యాలీ, సామూహిక కుంకుమార్చనలు
కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 14: దేవాదాయ ధర్మధాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు కమాన్ రోడ్డులో గల శ్రీమద్విరాట విశ్వకర్మ భగవానుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సర్వంగా సుదరంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా, శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, వేదపారాయణం, మూల విరాట్ ఫల-ఫంచామత అభిషేకములు, విశ్వకర్మ పతాక ఆవిష్కరణ, బైక్ ర్యాలీ, సాయంత్రం మహిళలతో గాయత్రీదేవి సామూహిక కుంకుమార్చనను నిర్వహించనున్నారు.
శనివారం గాయత్రీ విశ్వకర్మ యజ్ఞం, గాయత్రీ విశ్వకర్త భగవానుడి పల్లకీసేవ, విశ్వకర్త భగవానుడికి పుష్పార్చన, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం గాయత్రీ విశ్వకర్మ సహస్త్రనామార్చనలు, విశ్వకర్మ యజ్ఞం, సాయంత్రం శోభాయాత్రతో ఉత్సవాలు ముగిస్తాయి.
ఘనంగా నిర్వహిస్తాం
– గొల్లపల్లి శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్
ప్రతీసంవత్సరం లాగే మద్విరాట్ విశ్వకర్మ భగవానుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ సందర్భంగా శుక్రవారం బైక్ ర్యాలీ, ఆలయంలో కుంకుమ పూజలు, శనివారం టవర్ సర్కిల్లో అన్నదానం, ఆదివారం శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తాం. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి కృపకు పాత్రులు కావాలి.
ఆలయాన్ని ముస్తాబు చేశాం
– ఉడుతల వెంకన్న, ఆలయ ఈవో
వీర బ్రహ్మేంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో కమాన్ సమీపంలోని దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. గత సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా వారికి సరైన సౌకర్యాలు కల్పించాం. ఈ యేడు కూడా అన్ని ఏర్పాట్లు చేశాం.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

