Admissions | కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 10 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7, 10 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆరో తరగతికి ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 7,10 తరగతులకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 4:00 వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్ 944144 1042లో సంప్రదించాలని సూచించారు.