Dharmaram | బైక్ లను చోరీ చేసిన అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ
వివిధ జిల్లాలలో బైక్ లను చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు పెద్దపెల్లి ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఆయన వివరించారు.
- 10 వాహనాల స్వాధీనం
- వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ
Dharmaram | ధర్మారం, నవంబర్ 10 : వివిధ జిల్లాలలో బైక్ లను చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు పెద్దపెల్లి ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో విలేకరులకు చోరీ సంఘటన వివరాలను ఏసిపి వివరించారు. ఆయన కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కండ్లే బాపన్న అనే వ్యక్తి కూలి నాలీ చేస్తూ భార్య పిల్లలతో జీవనం గడిపేవాడు. కూలి పని చేయడం వలన సరైన సంపాదన ఉండదని గ్రహించిన బాపన్న ప్రవృత్తిగా బైక్ చోరీ చేయడం అలవాటు పడ్డాడు. గతంలో వివిధ జిల్లాలలో చోరీ చేసిన సంఘటనలు ఉన్నాయి.
ఇటీవల నంది మేడారం గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి తన బైక్ చోరీ అయిందని ఇచ్చిన ఫిర్యాదు పై పెద్దపల్లి సీఐ కె ప్రవీణ్ కుమార్, ధర్మారం ఎస్సై ఎంబడి శ్రీకాంత్ తో పాటు పలువురు పోలీస్ బృందం అప్రమత్తమై చోరీ చేదించడంపై దృష్టి పెట్టారు. దీంతో మంగళవారం మండల కేంద్రానికి అనుబంధంగా ఉన్న జక్కన్న పల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో బాపన్న అనే వ్యక్తి బైక్ ను చోరి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీపీ కృష్ణ వెల్లడించారు. బాపన్నను విచారించగా తాను చేసిన దొంగతనాలను అంగీకరించినట్లు ఆయన వివరించారు. నిందితుడు బాపన్న కోరుట్ల నుంచి జగిత్యాల, కరీంనగర్ హైవే రోడ్డు, కరీంనగర్ నుంచి లక్షట్ పేట వెళ్లే హైవే రోడ్డు ను ఆసరాగా చేసుకొని బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. అతని నుంచి సుమారు 10 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. బైకుల చోరీ సంఘటనలు పాల్పడిన నిందితుడు బాపన్నను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ పంపినట్లు ఆయన వివరించారు. ఈ సంఘటనను ఛేదించిన పెద్దపల్లి సీఐ, ధర్మారం ఎస్సైలను ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ అభినందించారు.

రివార్డు అందజేస్తున్న ఏసీపీ కృష్ణ
పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేత
వివిధ ప్రాంతాలలో బైకుల చివరికి పాల్పడిన దొంగ బాపన్నను చాకచక్యంగా పట్టుకొని సేవించిన పలువురు పోలీస్ బృందానికి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ రివార్డులను అందజేశారు. హెడ్ కానిస్టేబుళ్లు రమేష్, మొహిషన్ పాషా, పీసీలు లోకిని సతీష్, శిరీష్, తిరుపతి, స్టేషన్ రైటర్ సుందర్ సింగ్ కు రివార్డులు అందజేసి అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Scene | సూర్య ‘సీన్’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు!
‘ప్రభుత్వాలు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

