కమీషన్ ఇస్తేనే లోన్?
: మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వా రా రుణాల మంజూరులో ఆర్పీలు, సీవోలు కుమ్మక్కైఅడ్డగోలుగా కమీషన్లు వసూలు చేస్తున్నారని సంఘాల సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిరుణం మంజూరులోనూ మెప్మా సిబ్బందికి ఒకటి నుంచి మూడు శాతం కమీషన్లు ఇవ్వాల్సిందేనని,
- మహిళా సంఘం గ్రూపుల్లో అక్రమ దందా
- ఒకటి నుంచి మూడు శాతం వసూలు
- లేదంటే సవాలక్ష సాకులు
- ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు
మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక ఎదుగుదలకు సహకారం అందించాల్సిన మెప్మా సిబ్బంది అక్రమ దందాకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా వచ్చే రుణాల మంజూరులో పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేస్తున్నారని, లేదంటే సవాలక్ష సాకులు చూపించి రుణాలు రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు విమర్శిస్తున్నారు. మెప్మాలోని కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి వరకు వాటాల వారీగా ముడుపులు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 11 : మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వా రా రుణాల మంజూరులో ఆర్పీలు, సీవోలు కుమ్మక్కైఅడ్డగోలుగా కమీషన్లు వసూలు చేస్తున్నారని సంఘాల సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిరుణం మంజూరులోనూ మెప్మా సిబ్బందికి ఒకటి నుంచి మూడు శాతం కమీషన్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే రుణాలు రా కుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల వావిలాలపల్లికి చెందిన ఓ మహిళా సంఘం సభ్యులు రెండేళ్లుగా బ్యాంకు రుణం కోసం తిరుగుతున్నా.. ఇవ్వకుండా అడ్డుంకులు పెడుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా సంఘం రికార్డులు సరిగా లేవని, లేకపోతే నిర్వహణ సరిగా లేదంటూ పక్కన పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్పీలు కమీషన్లు లేకపోతే సంఘాలకు సంబంధించిన ఏ ఫైల్ కూడా ముందుకు తీసుకపోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సంఘాల అయితే లోన్ కోసం ఏండ్ల నుంచి తిరగుతున్నా ఏదో ఒక కారణంతో పక్కన పెడుతున్నారనే విమర్శలున్నాయి.
తప్పుడు లెక్కలపై చర్యలేవీ?
మహిళా సమాఖ్యలు, సంఘాలకు సంబంధించి నగరంలోని అనేక డివిజన్ల నుంచి తప్పుడు లెక్కలు రాసి పలువురు ఆర్పీలు, సీవోలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై నగరంలోని పలు డివిజన్లలో సమాఖ్య ఆర్థిక లెక్కల్లో అనేక అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై మెప్మా జిల్లా యంత్రాగం విచారణ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై పెద్దగా చర్యలు లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యం గా రుణాల మంజూరులో పర్సంటేజీల వారీగా కమీషన్లు వసూళ్లు చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

