Korutla | నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు తప్పవు.. కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్
నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు కిరాణా షాపులు, స్వీట్ హోమ్, టిఫిన్ సెంటర్లు, బేకరీ షాపుల్లో, మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
Korutla | కోరుట్ల, జనవరి 18: నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు కిరాణా షాపులు, స్వీట్ హోమ్, టిఫిన్ సెంటర్లు, బేకరీ షాపుల్లో, మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న దుకాణదారులు, హోటల్ యజమానులకు రూ.4600 జరిమానా విధించారు. బట్ట, పేపర్, జనపనార సంచులు ఉపయోగించాలని అవగాహన కల్పించారు.
ప్రతి దుకాణదారుడు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని లేనిచో షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్ చెల్లించని దుకాణదారుల నుంచి రూ.5944 పీజులు అధికారులు వసూలు చేశారు. హోటల్లో కస్టమర్లకు నాణ్యత కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. దుకాణాల నుంచి వెలువడిన చెత్తను తడి, పొడి, హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, వార్డ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

