Applications | చిగురుమామిడి, మే 25 : చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ గ్రామాల్లోని వెనుకబడిన బాలుర సంక్షేమ వసతి గృహాలు (ఎస్సీ హాస్టల్) లో విద్యార్థులు ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా హాస్టల్ వార్డెన్లు మహేందర్ రెడ్డి, కిషన్ నాయక్, లకేందర్ తెలిపారు. చిగురుమామిడి హాస్టల్లో 82, ఇందుర్తి హాస్టల్లో 79, రేకొండ హాస్టల్లో 78 ఖాళీలు ఉన్నట్లు వారు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం బోధన ఉందని, ప్రభుత్వం అన్ని విధాల విద్యార్థులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో ఈ హాస్టళ్లలోని విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు.