ఆధార్ అప్డేట్ గడువు పెంపు
వ్యక్తుల ప్రాథమిక గుర్తింపునకు మూలాధారమైన ఆధార్ వివరాలు ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఉడాయ్ మరోసారి పొడిగించింది.
- మార్చి14 వరకు పొడిగింపు
- మార్పులు, చేర్పులకు అవకాశం
వ్యక్తుల ప్రాథమిక గుర్తింపునకు మూలాధారమైన ఆధార్ వివరాలు ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఉడాయ్ మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 14 వరకు పెంచుతూ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే మూడు సార్లు గడువు పెంచగా, ఇటీవల పెంచిన గడువు ఈ నెల 14 (గురువారం)తో ముగియనున్నది. యూఐడీఏఐ గణాంకాల మేరకు ఆధార్ పొంది పదేళ్లు పూర్తయి తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉండడంతో మరోసారి గడువు పొడిగించామని ఆధార్ జిల్లా మేనేజర్ తెలిపారు.
-కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 13
కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 13 : ఆధార్ అప్డేట్ గడువును మరోసారి పొడిగించారు. వయసు పెరుగుతున్నకొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. కాగా, ఆధార్ కార్డు వివిధ అవసరాలకు ప్రామాణికమవుతోంది. దీంతో వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుండగా, అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డులోని వ్యక్తులు ఇబ్బందులు ఎదురొంటున్నారు. వీటని పరిషరించే క్రమంలో ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ యూఐడీఏఐ అవకాశం కల్పించింది.

గతేడాది డిసెంబర్ నుంచి మూడు మాసాల పాటు ఉచితంగా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చంటూ ప్రకటించింది. అయితే కార్డుదారులు అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఆశించిన మేర మార్పులు చేసుకోలేదు. దీంతో ఈఏడాది మార్చి 14 నుంచి మరో మూడు నెలల పాటు అంటే జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల్లో కొద్దిమేర చైతన్యం రాగా, అప్డేట్ చేసుకునే వారి సంఖ్య క్రమేపి పెరిగింది.
అయితే ఈలోపు గడువు సమీపించడంతో మరో మూడు మాసాలు పెంచుతూ ఈనెల 14వరకు అవకాశం కల్పించింది. అయినా, ఇంకా పదేళ్ల గడువు ముగిసిన వారు భారీ సంఖ్యలోనే ఉండడంతో మరోసారి మార్చి 14 వరకు గడువు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిన అనంతరం అప్డేట్తో పాటు ఫొటో, నివాసం, ఇతర మార్పులు, చేర్పులు చేసుకునేందుకు విధిగా రూ.50 చెల్లించాల్సి ఉంటుందని ఆధార్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఉచితంగా ఆన్లైన్లో నమోదు
ఉచితంగా ఆన్లైన్ చేసుకునే విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఉడాయ్ పోర్టల్‌లో https://myaadhaar.uidai.gov.in ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రొసీడ్ టూ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌చేసిన అనంతరం డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వివరాలు స్క్రీన్‌పై వస్తాయి.
వాటిని పూర్తిగా పరిశీలించి, సవరణ ఉంటే చేయాలి. లేదంటే ఉన్న వివరాలతోనే నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. కిందకు స్రోలింగ్ చేస్తే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను సాన్ చేసి అప్లోడ్ చేయాలి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

