ఓటర్ల రీసర్వే
ఓటర్ల తొలగింపుపై రీ సర్వేను వేగంగా చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగిన వారి తొలగింపులో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా బూత్‌స్థాయి అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
- ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రంగంలోకి యంత్రాంగం
- ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరణ
- అర్హులైన వారి పేర్లు తిరిగి నమోదు
- వేగంగా ఆధార్ సీడింగ్
- రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం
ఓటర్ల తొలగింపుపై రీ సర్వేను వేగంగా చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. రెండు, మూడు చోట్ల ఓట్లు కలిగిన వారి తొలగింపులో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు క్షేత్రస్థాయి సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా బూత్‌స్థాయి అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అర్హులను గుర్తించి తిరిగి నమోదు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని, మొత్తంగా రెండు శాతం ఓటర్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, మే 4 : రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఒకరికి ఓకే ఓటు నినాదంతో రెండు, మూడుచోట్ల ఓటు ఉన్నవారిని తొలగింపు ప్రక్రియ గతేడాది చేపట్టి జనవరినాటికి పూర్తిచేసింది. అయితే కొన్నిచోట్ల ఓటర్లు సరైన సమాచారం అందించకపోవడంతో వారి ఓట్లను తొలగించారు. గత జనవరి చివరివారంలో ఓటర్ల జాబితా విడుదల చేశారు. 2022 సంవత్సర ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 10,10,640 మంది ఓటర్లు ఉండగా, వీరికి అదనంగా మరో 22,415 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. మొత్తం 10,33,055 మంది ఓటర్లు జిల్లాలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, కొన్నిచోట్ల రెండు, మూడు ఓట్లు కలిగిన వారు కూడా ఉండడంతో వారిని తొలగించాలంటూ ఎన్నికల కమిషన్ చేసిన సూచన మేరకు, పేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా 36,601 మందిని గుర్తించారు. వారికి ఒకేచోట ఓటు హక్కు అవకాశం కల్పించగా చాలా మంది పట్టించుకోలేదు. దీంతో వీరిని ఆన్లైన్ ద్వారా తొలగించారు.
అయితే, 2023 జనవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలో 9,97,143 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాలు పట్టణాల్లోని మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీల్లో ప్రదర్శించారు. వీటిలో పలువురు తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు విన్నవించారు. దీంతో తొలగించిన ఓటర్లపై తిరిగి సర్వేచేస్తున్నారు. వారి ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించి అర్హులను తిరిగి నమోదు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో రెండంకెల సంఖ్యలో ఓట్లు తిరిగి నమోదువుతుండగా, పూర్తయ్యే సరికి కనీసం రెండు శాతం ఓట్లు తిరిగి అదనంగా పెరిగే అవకాశాలున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే, ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కూడా పూర్తి చేయాలంటూ బీఎల్వోలు ఓటర్లకు సూచిస్తున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం లో 86.61 శాతం, హుజురాబాద్‌లో 84.11 శా తం, చొప్పదండిలో 80.31శాతం, కరీంనగర్లో అత్యల్పంగా 50.27 శాతం మంది ఓటర్లు ఆధార్ తో అనుసంధానం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగిలిన వారివి కూడా త్వరలోనే సీడింగ్ చేస్తామని పేర్కొంటున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

