GodavariKhani | కుక్క పిల్లకు మాతృత్వం పంచిన కోతి.. గోదావరిఖనిలో అరుదైన దృశ్యం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరుదైన..వింతైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. జంతువుల్లో జాతి వైరం సహజం. అందునా కోతులకు, కుక్కలకు అస్సలే పడదు. కానీ ఓ వానరం జాతి వైరంకు సవాల్ విసిరింది.
- జాతి వైరానికి సవాల్ విసిరిన వైనం
GodavariKhani | కోల్ సిటీ, మార్చి 13: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరుదైన..వింతైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. జంతువుల్లో జాతి వైరం సహజం. అందునా కోతులకు, కుక్కలకు అస్సలే పడదు. కానీ ఓ వానరం జాతి వైరంకు సవాల్ విసిరింది. మాతృత్వం అన్న పదానికి జాతి వైరం అడ్డుకాదని చాటింది. తల్లి లేని ఓ కుక్క పిల్లను అక్కున చేర్చుకుంది. తన ఒడిలోకి తీసుకొని మాతృ ప్రేమను, ఆ మాధుర్యాన్ని పంచింది. గోదావరిఖని హనుమాన్ నగర్‌లోని సింగరేణి క్వార్టర్ ఏరియాలో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు ఓ కుక్క పిల్ల బిక్కుబిక్కు మంటూ వానరం కంటపడింది.
ఇక అంతే ఆ వానరం జాతి వైరంను ప్రక్కనబెట్టింది. ఆ కుక్క పిల్లను తన ఒడిలోకి తీసుకొని ఓ ఇంటిపైకి తీసుకవెళ్లింది. కాసేపు చెట్టు నీడన కుక్క పిల్లను ఆడించింది. ఈ సంఘటన చూసేందుకు జనం గుమిగూడగా కోతి మాత్రం ఆ కుక్క పిల్లను వదలకుండా తన వెంట తీసుకవెళ్లింది. ఈ అరుదైన దృశ్యం అందరి హృదయాలను కదిలించింది. మానవ సంబంధాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ మూగ జీవి ప్రేమ కనువిప్పు కలిగించింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

