60కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
ఆంధ్రా నుంచి మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన చందు నాగేశ్వరరావు ఇరువై ఏండ్ల క్రితమే మంచిర్యాల జిల్లా బీమారం హామ్లెట్ గ్రామం గుంటూరుపల్లిలో స్థిరపడ్డాడు.
రాంనగర్, జూన్ 6: ఆంధ్రా నుంచి మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన చందు నాగేశ్వరరావు ఇరువై ఏండ్ల క్రితమే మంచిర్యాల జిల్లా బీమారం హామ్లెట్ గ్రామం గుంటూరుపల్లిలో స్థిరపడ్డాడు. గురువారం పత్తిపాడు నుంచి ఓ వాహనంలో 1.20లక్షల విలువైన 60 కిలోల నకిలీ విత్తనాలను గుంటూరుపల్లికి తీసుకెళ్తున్నాడు.
కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గోపాల్పూర్ క్రాస్ రోడ్ వద్ద కరీంనగర్ టాస్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, రూరల్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేస్తుండగా.. నాగేశ్వరరావు వాహనాన్ని సోదా చేశారు. అందులో 60 కిలోల నకిలీ విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 3(1) ఆఫ్ సీడ్స్ యాక్ట్, సెక్షన్ 8, 15(1) ఆఫ్ సీడ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తనిఖీల్లో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, టాస్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రవీందర్, కరీంనగర్ రూరల్ ఎస్ఐ శేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

