ఇంటర్ ఎగ్జామ్స్ రేపటి నుంచే ..
ఇంటర్మీడియట్ పరీక్షలను ఈ నెల 28నుంచి మార్చి 19 వరకు నిర్వహిం చేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి.
- జిల్లా వ్యాప్తంగా 18సెంటర్లు
- కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
- జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మోహన్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షలను ఈ నెల 28నుంచి మార్చి 19 వరకు నిర్వహిం చేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి. జిల్లాలో మొత్తం 18పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఫస్టియర్‌లో 4,609 మం ది, సెకండియర్‌లో 3,934మంది విద్యార్థు లు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలివే..
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ప్రభుత్వం జిల్లాలో 18 కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిరిసిల్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలురు), సెస్ జూనియర్ కళాశాల (బాలికల), కోనరావుపేట, ఇల్లంతకుంట, వేములవాడ, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టీఎస్‌డబ్ల్యూ ఆర్ఎస్ జూనియర్ కళాశాల (బాలికలు), సిరిసిల్లలో ప్రైవేట్ కళాశాలలు శ్రీకృష్ణదేవరాయ, సాయిశ్రీ (అనంతనగర్), సహస్ర జూనియర్ కళాశాల, వేములవాడలో పవిత్ర జూనియర్ కళాశాల,
వివేకానంద జూ నియర్ కళాశాల, సుమిత్రశ్రీ ఒకేషనల్ జూనియర్ కళాశాల, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి రాచర్ల జూనియర్ కళాశాలల్లో సెంటర్లను ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద పోలీసులు 144సెక్షన్ అమలు చేయనున్నారు. కేంద్రాల కు వంద మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేశారు. ఇద్దరు డీఈసీలు, ఏడుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్లు, ముగ్గురు ఫ్ల్లయింగ్ స్క్వాడ్లు, ముగ్గురు కస్టొడీయన్స్ను నియమించారు.
ఒత్తిడిని దూరం చేసేందుకు టెలీమానస్
పరీక్షలు రాసే విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని, ఆందోళన, భయాన్ని దూరం చేసేందు కు టెలీమానస్ అనే కార్యక్రమాన్ని యం త్రాంగం చేపట్టింది. ఇందుకోసం రెండు టోల్ ఫ్రీ నంబర్లను (14416, 1800914416) తోపాటు హెల్ప్‌లైన్ కేంద్రం నంబర్‌ను 944059995 ఏర్పాటు చేసింది.
పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పా ట్లు చేశాం. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది.
– మోహన్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

