దేశ సమైక్యతను చాటాలి
- వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
- మహనీయుల జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాలి
- మంత్రి గంగుల కమలాకర్
- కరీంనగరంలో అట్టహాసంగా ఫ్రీడం రన్
కొత్తపల్లి, ఆగస్టు 11: ప్రతిఒక్కరూ వజ్రోత్సవాల్లో పాల్గొని దేశసమైక్యతను చాటాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ఎందరో మహనీయుల పోరాట ఫలంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పారు. బాపూజీ స్ఫూర్తితో ఆహింసామార్గంలో కేసీఆర్ ప్రజలందరినీ కార్యోన్ముఖులను చేసి తెలంగాణను సాధించారని కొనియాడారు. స్వరాష్ట్రంతోనే బంగారు భవిష్యత్ సాధ్యమని నమ్మే ఆయన ప్రజల కలను సాకారం చేశారని చెప్పారు. గురువారం కరీంనగర్లో నిర్వహించిన ఫ్రీడంరన్‌ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్‌రావు, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. జై జవాన్..జై కిసాన్..భారత్ మాతాకీ జై’ అంటూ వేలాది గొంతుకల నినాదాలతో కరీంనగర్ మార్మోగింది.
ఫ్రీడం రన్ కోర్టు చౌరస్తా నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రపంచ దేశాలు ఈర్ష్యపడేలా, మన అభివృద్దిని చూసి విస్మయం చెందేలా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వజ్రోత్సవాలలో మొక్కలు నాటడం, తలసేమియా లాంటి ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తదానం చేయాలని కోరారు. అలాగే ఈనెల 16న ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని సూచించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్ముడు ఆచరించిన ఉప్పు సత్యాగ్రహం, ఆహింసా మార్గాన్ని, ఆయన సిద్ధాంతాన్ని నేటి తరాలకు తెలియజేయాలని సూచించారు. మనమందరం అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణీ హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, డీవైఎస్వో కే రాజవీరు, జిల్లా యువజన అధికారి వెంకటరాంబాబు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్దారెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బుర్ర మధుసూదన్‌రెడ్డి,కార్పొరేటర్లు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

