మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 07, 2020 , 03:12:16

రాష్ట్రస్థాయికి ఏకశిల బీఈడీ కాలేజీ ఎగ్జిబిట్‌

రాష్ట్రస్థాయికి ఏకశిల బీఈడీ కాలేజీ ఎగ్జిబిట్‌

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 06 : జనగామ పట్టణంలోని ఏకశిల బీఈడీ కాలేజీ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్‌ రాష్ట్రస్థాయికి ఎంపికైందని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ మర్రెడ్డి, కళాశాల సెక్రటరీ సీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మాట్లాడుతూ వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కాలేజీలకు నిర్వహించిన ప్రదర్శనలో తమ కాలేజీ నుంచి ఆరు సబ్జెక్టుల్లో సాంఘీక శాస్త్రం విభాగం నుంచి విద్యార్థినులు డీ సోని, ఎస్‌ బిందు రూపొందించిన ఎగ్జిబిట్‌ యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. కాగా, జనగామ ఏకశిల బీఈడీ కాలేజీ విద్యార్ధుల ప్రదర్శనలను కేయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ మహేందర్‌రెడ్డి, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ విజయలత తిలకించి విద్యార్ధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. 


logo
>>>>>>