ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Jan 25, 2020 , 02:00:54

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
  • - మహా జాతర సమీపిస్తోంది
  • - మంత్రులు దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌తాడ్వాయి, జనవరి 24 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారక్కల మహా జాతరను పురస్కరించుకుని చేపట్టిన అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మాలోతు కవితలు అన్నారు. మేడారం జాతర పరిసరాలలో పలు శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప లు అభివృద్ది పనులను వారు పరిశీలించారు. మొదటగా ఆ ర్టీసీ ఆధ్వర్యంలో బస్టాండ్‌లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చి, తిరుగు ప్రయాణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం జంపన్నవాగుపై గల స్నాన ఘట్టాల వద్దకు చేరుకున్నా రు. స్నానఘట్టాలపై ఏర్పాటు చేసిన బ్యా టరీ ఆఫ్‌ ట్యాప్స్‌ను పరిశీలించారు. వాగు లో ఇసుక లెవలింగ్‌, ఇసుక బస్తాలతో ఏర్పాటు చేసిన అడ్డుకట్టలను పరిశీలించారు. ఒకేసారి ఎంతమంది భ క్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన చాటు గదులను లోపలికి వెళ్లి పరిశీలించారు. స్నాన ఘట్టాలపైకి దిగి ట్యాప్స్‌ ద్వారా వస్తున్న నీటిని తలపై చల్లుకుని ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వాగులో ఎ లాంటి ప్రమాదాలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, జాతర పరిసరాల్లో చేడుతున్న పారిశుధ్యం పనులను డీపీవో వెంకయ్య ను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతర నిర్వహణలో పంచాయతీ శాఖది ముఖ్యపాత్ర అని, పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే వేలాదిగా భ క్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారని, పనులు సక్రమంగా చేపట్టకపోతే జాతరలో దుర్వాసనలు వచ్చే అవకాశం ఉందని, అదనపు కూలీలను నియమించి పనులను చేపట్టాలన్నారు. భక్తులు ఎక్కువగా విడిది చేసే ప్రాంతాలను గుర్తించి పారిశుధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. అభివృద్ధి పనులను అధికారులు స్థానికంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, మరింత వేగం పెంచి పూర్తి చేయాలని ఆదేశించారు.logo