Shark | హుర్గడా: ఈజిప్టులోని ఒక బీచ్‌లో ఈతకొడుతున్న యువకుడిపై షార్క్ దాడి చేసి చంపేసి తినేసింది. యువకుడి తండ్రితో పాటు పలువురు చూస్తుండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈజిప్ట్‌లోని హుర్గడా రిసార్టు బీచ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. రష్యాకు చెందిన 23 ఏండ్ల యువకుడు వ్లాదిమిర్ పాపొవ్ తండ్రితో కలిసి బీచ్‌లో ఈతకొడుతున్నాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన టైగర్ షార్క్ అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లి చంపి తినేసింది.