Xi Mingze | న్యూయార్క్ : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూతురు మింగ్జి అమెరికాలో రహస్య జీవితం గడుపుతున్నట్టు తెలుస్తున్నది. హార్వర్డ్ వర్సిటీలో చదువుకుంటూ కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్యంగా నివసిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
భద్రతా కారణాల రీత్యా చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబినో ప్రకటించిన నేపథ్యంలో జిన్పింగ్ కూతురు నివాసం గురించి చర్చ మొదలైంది.