3d printed house in italy | ‘చీకట్లో పెట్టిన కందిలి’ని తలపిస్తున్న ఈ ఇండ్లు ప్రపంచంలోనే తొలి పర్యావరణహిత 3-డీ ప్రింటెడ్ గృహాలు. ఇటలీలోని మస్సా లోంబార్డాలో 200 గంటల్లోనే వీటిని నిర్మించారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా స్థానికంగా దొరికే మన్నుతో వీటిని నిర్మించారు. తక్కువ ఖర్చుతో ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ఇండ్లలో లివింగ్ రూమ్, బాత్ రూమ్, బెడ్ రూమ్ ఉన్నాయి. నిరాశ్రయులు, ప్రకృతి విపత్తుల కారణంగా వలస వచ్చిన వారికోసం వీటిని నిర్మించారు.