న్యూయార్క్, జూలై 28: ఆయుష్షు పెరగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ, అధిక వ్యాయామమూ అనర్థదాయకమే. ఈ నేపథ్యంలో ఆయుష్షు పెరిగేందుకు వారానికి 5 గంటల నుంచి 10 గంటల మధ్య వ్యాయామం చేయాలని అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాదాపు 1,16,000 మందిని 30 ఏండ్ల పాటు పరిశోధించి ఈ నిర్ణయానికి వచ్చారు.