మనం రోజూ తప్పనిసరిగా స్నానం చేస్తాం. స్నానం చేయనిదే ఏ పని చేయం. కొందరు రోజులో ఏదో సమయంలో కచ్చితంగా స్నానం చేస్తుంటారు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు స్నానం చేయాలనేది తెలిసిన విషయమే. శీతాకాలంలో స్నానం చేసేందుకు కొందరు బద్ధకిస్తుంటారు. రెండు లేదా మూడు రోజులు స్నానం చేయకుండా ఉంటారు. అయితే, పదిరోజులకొకసారి స్నానం చేశానని ఎవరైనా చెప్తే మీ స్పందన ఎలా ఉంటుంది. ఓ మహిళ చిన్నప్పటినుంచీ పదిరోజులకొకసారి మాత్రమే స్నానం చేస్తుందట. అంటే నెలకు మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తుంది. తాను పదిరోజులకొకసారి మాత్రమే స్నానం చేస్తానని, అయినా తన ఒంటినుంచి దుర్వాసన రావడం లేదని ఆ మహిళ పేర్కొంటోంది.
ఆ మహిళ పేరు ఐడాన్ జేన్ (23) ప్రసిద్ధ టిక్‌టాకర్. స్నానం చేయడానికి ఇష్టపడని అమ్మాయిల్లో తనూ ఒకదానినని ఆమె ఇటీవల తన ఫాలోవర్స్‌తో చెప్పింది. నెలకు మూడుసార్లు మాత్రమే స్నానం చేస్తానని, పీరియడ్స్ వచ్చే రోజుల్లో కూడా ఈ రొటీన్ మారదని చెప్పింది. ఏడు రోజులు స్నానం చేయకుండా కూడా తాను చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నానని ఆమె వీడియోలో చెప్పింది. ఎంతో విలువైన పర్యావరణాన్ని, నీటిని కాపాడడమే ఈ నిర్ణయానికి కారణమని ఐడాన్ స్పష్టంచేసింది. కష్టపడి పనిచేయనివారికి చెమటలు పట్టడం లేదా మురికి పేరుకోకుంటే రోజూ స్నానం చేయాల్సిన అవసరమే లేదని చెబుతోంది ఐడాన్. ఈ వీడియో మూడు మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా, ఆమెను చాలామంది నెటిజన్లు ట్రోల్ చేశారు. తన కోసం కాకుండా ఇతరుల కోసం స్నానం చేయాలని ఆమెకు సూచించారు.