Road Accident | అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. వృద్ధురాలు మృతి
Road Accident | మెరికా (USA) లోని టెక్సాస్ (Texas) లో ఆధునిక టెక్నాలజీ (Technology) విషాదాన్ని మిగిల్చింది. ఆటోమేటెడ్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు ఒకటి అదుపుతప్పి నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటనతో ఆధునిక సాంకేతికతతో నడిచే వాహనాల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
Road Accident : అమెరికా (USA) లోని టెక్సాస్ (Texas) లో ఆధునిక టెక్నాలజీ (Technology) విషాదాన్ని మిగిల్చింది. ఆటోమేటెడ్ మోడ్‌లో ఉన్న టెస్లా కారు ఒకటి అదుపుతప్పి నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటనతో ఆధునిక సాంకేతికతతో నడిచే వాహనాల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో కాటీ నగరంలో జరిగింది. మైఖేల్ బట్లర్ (Michail Butler) అనే వ్యక్తి తన టెస్లా మోడల్ 3 (Tesla Model Car 3) కారులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో కారు ఆటోమేటెడ్ డ్రైవింగ్ మోడ్‌లో ఉందని అధికారులు గుర్తించారు. కారు అత్యంత వేగంతో వచ్చి ఇంటి ఇటుక గోడను బద్దలుకొట్టుకుని లోపలికి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంటి ముందు గదిలో ఉన్న 76 ఏళ్ల మార్తా అవిలా అనే మహిళను కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మార్తాను వెంటనే మెడికల్ హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన సర్వైలెన్స్ వీడియోను మృతురాలి కుమార్తె జెన్నిఫర్ బార్బర్ ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు.
‘ఈ టెస్లా డ్రైవర్ మా ఇంట్లోకి ఇలా దూసుకొచ్చాడు. మా అమ్మకు ఇలా జరగాల్సింది కాదు’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తన తల్లి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. ‘మా అమ్మ చాలా మంచిది. ఉదార స్వభావి. 76 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎలాంటి మందులు వాడేవారు కాదు. మా నానమ్మలాగే ఆమె కూడా 100 ఏళ్లు బతికేది’ అని జెన్నిఫర్ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదం కారణంగా అవిలా కుటుంబం నివసిస్తున్న ఇల్లు నివాసయోగ్యం కాకుండా పోయింది. దీంతో వారు తాత్కాలిక నివాసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కష్టకాలంలో కుటుంబాన్ని ఆదుకునేందుకు, అంత్యక్రియల ఖర్చులు, ఇల్లు పునర్నిర్మించుకునేందుకు సహాయంగా ‘GoFundMe’ పేజీని ప్రారంభించారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న మైఖేల్ బట్లర్ మద్యం మత్తులో లేడని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది. కాగా టెస్లా ఆటోపైలట్ ఫీచర్ గతంలోనూ అనేక వివాదాల్లో చిక్కుకుంది. దీని పనితీరుపై పలుమార్లు ప్రశ్నలు తలెత్తాయి. అయితే డ్రైవర్లు తప్పనిసరిగా తమ చేతులను స్టీరింగ్‌పై ఉంచి, ఎప్పుడైనా కారును తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని టెస్లా తన యూజర్ మాన్యువల్స్‌లో స్పష్టంగా సూచిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

