లాభం తీసుకోకుండానే వ్యాక్సిన్లు ఇస్తాం.. ఇండియాకు ఫైజర్ ఆఫర్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి అమెరికా ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ మంచి ఆఫర్ ఇచ్చినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. లాభం తీసుకోకుండానే ప్రభుత్వానికి తమ కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని తెలిపారు. ఇండియా కోసం మాత్రమే లాభం చూసుకోని ధరను మేము ప్రతిపాదించాము. ప్రభుత్వ ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగం కావాలన్నదే మా ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతాయి అని ఫైజర్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఇండియాలో అమెరికా వ్యాక్సిన్ల ధరలపై వచ్చిన కొన్ని వార్తలను ఖండిస్తూ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ధనిక, మధ్య ఆదాయ, పేద దేశాలకు ఒక్కో విధంగా తమ వ్యాక్సిన్ల ధరలను నిర్ణయించినట్లు ఫైజర్ తెలిపింది. ప్రపంచంలో అందరికీ సమానంగా తమ కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కేవలం ప్రభుత్వాలకే వ్యాక్సిన్లు సరఫరా చేయడం అనేది అందులో భాగమే అని చెప్పింది. ఇండియా విషయంలోనూ ఇదే అనుసరిస్తామని తెలిపింది.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియాలో విదేశీ వ్యాక్సిన్లకు అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు చెందిన ఫైజర్‌తోపాటు మోడెర్నా, జాన్సన్ అండర్ జాన్సన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం ఫైజర్ అమెరికాలో ఒక్కో వ్యాక్సిన్ డోసుకు 19.5 డాలర్లు, యూరప్‌లో 23 డాలర్లు వసూలు చేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

