Julian Assange | అసాంజేకు విముక్తి.. స్వదేశం చేరుకున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు
సైనిక రహస్యాలతోపాటు పలు దేశాల అంతర్గత విషయాలను బట్టబయలు చేసి అగ్రదేశాలకు సైతం వణుకు పుట్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే కథ సుఖాంతమైంది. ఐదేండ్లకుపైగా లండన్ జైల్లో గడిపిన అసాంజే బుధవారం ఎట్టకేలకు తన స్వదేశం ఆస్ట్రేలియా చేరుకున్నారు.
Julian Assange | కాన్బెర్రా, జూన్ 26: సైనిక రహస్యాలతోపాటు పలు దేశాల అంతర్గత విషయాలను బట్టబయలు చేసి అగ్రదేశాలకు సైతం వణుకు పుట్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే కథ సుఖాంతమైంది. ఐదేండ్లకుపైగా లండన్ జైల్లో గడిపిన అసాంజే బుధవారం ఎట్టకేలకు తన స్వదేశం ఆస్ట్రేలియా చేరుకున్నారు.
అమెరికా సైనిక రహస్యాలను ప్రచురించిన నేరానికి బుధవారం మరియానా దీవుల రాజధాని సైపాన్‌లో అమెరికా జిల్లా కోర్టులో అసాంజేపై విచారణ జరిగింది. ముందస్తు ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే జైలు జీవితం గడిపిన అసాంజేను విడుదల చేశారు. విచారణ నిమిత్తం లండన్ నుంచి సైపాన్ నగరానికి చార్టెర్డ్ ఫ్లయిట్లో వెళ్లిన అసాంజే.. అదే విమానంలో ఆస్ట్రేలియా చేరుకున్నారు.
అసాంజేకు తోడుగా అమెరికాలో ఆస్ట్రేలియన్ రాయబారి, కెవిన్ రూడ్, బ్రిటన్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ స్టీఫెన్ స్మిత్ వెళ్లారు. అసాంజే విడుదలలో వీరిద్దరూ కీలకపాత్రలు పోషించారు. వికిలీక్స్ పనులు కొనసాగుతాయని, వాక్ స్వాత ంత్య్రం, ప్రభుత్వంలో పారదర్శకత కోసం అసాంజే ముందుకు సాగుతారని ఆయన తరఫు న్యాయవాది బారీ పొల్లాక్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

