Donald Trump | ట్రంప్ ఎందుకు అరెస్టయ్యారు.. ఆయన మీదున్న కేసు ఏమిటి..?
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురవారం అరెస్టయ్యి, 20 నిమిషాల పాటు జైల్లో గడిపి, ఆ వెంటనే జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దాంతో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ బ్యాడ్ రికార్డు మూటగట్టుకున్నారు.
అట్లాంటా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురవారం అరెస్టయ్యి, 20 నిమిషాల పాటు జైల్లో గడిపి, ఆ వెంటనే జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దాంతో క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ బ్యాడ్ రికార్డు మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అరెస్టయ్యారు..? ఆయన మీద ఉన్న కేసు ఏమిటి..? అనే సందేహాలు సర్వత్రా చర్చనీయాంశాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జార్జియా ఎన్నికల ఫలితాలను తారుమారే చేసేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఎన్నికల సందర్భంగా ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ట్రంప్.. గత మార్చి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
గురువారం రాత్రి 7 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ట్రంప్ అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. జైలులో 20 నిమిషాల పాటు గడిపిన అనంతరం రూ.2 లక్షల డాలర్ల పూచీకత్తుతో విడుదలయ్యారు. ఆయన అరెస్ట్, విడుదలకు సంబంధించిన ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసిపోయింది.
కాగా, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ట్రంప్ తనని తాను వెనకేసుకొచ్చుకుంటున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వం తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తున్నారు. దేశ చరిత్రలో తన అరెస్ట్ ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

