తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు రెండోసారి వాయిదా.. ఎందుకంటే?

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో వెనుకడుగు వేస్తున్నారు. ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారు. తొలుత శుక్రవారం ప్రార్థనల అనంతరం గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్ సుప్రీం కమాండర్‌గా కొత్త ప్రభుత్వాన్ని ప్రకటిస్తామని తాలిబన్ తెలిపింది. అయితే ఇది శనివారానికి వాయిదా పడింది. కాగా, కొత్త ప్రభుత్వం, కేబినెట్ మంత్రులను మరో రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ శనివారం తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఎలాంటి కారణం చెప్పలేదు.
మరోవైపు అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యమైన సమగ్ర పరిపాలనను రూపొందించడంపై తాలిబన్లు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ గ్రూపులతో చర్చల కోసం ఒక కమిటీని కూడా నియమించారు. ‘తాలిబాన్లు తమంతట తాముగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ వారు ఇప్పుడు అన్ని పార్టీలు, సమూహాలు, సమాజంలోని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం ఉండే పరిపాలనపై దృష్టిసారించారు’ అని కమిటీ సభ్యుడు, కాబూల్ సెక్యూరిటీ ఇంఛార్జ్ ఖలీల్ హక్కానీ తెలిపారు.
‘ఆఫ్ఘన్ ప్రజలకు భద్రత కల్పించే సామర్థ్యం తాలిబన్లకు ఉన్నది. కానీ, ఒక క్రియాత్మక ప్రభుత్వాన్ని నడపడానికి యువత, విద్యావంతులైన ఆఫ్ఘన్ల ప్రాతినిథ్యం, సహకారం అవసరం. కాలం చెల్లిన రాజకీయ నాయకులు అని పిలిచే వారిని పూర్తిగా పక్కన పెట్టాలి. తద్వారా సంకీర్ణ ప్రభుత్వం విఫల అనుభవం పునరావృతం కాకూడదు’ అని ఖలీల్ హక్కానీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని గుల్బుద్దీన్ హెక్మత్యార్, పదవీచ్యుతుడైన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్‌జాయ్‌కు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, పంజ్‌షీర్ ప్రతినిధులతో తాలిబన్ల చర్చలు విఫలమయ్యాయి. దీంతో తాలిబన్లపై పోరాటాన్ని రెబల్ దళాలు తీవ్రం చేశాయి. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి ఇది కూడా ఒక కారణం కావచ్చని తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

