pandora papers | పండోరా పేపర్స్‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆ డేటా లీక్ ఎంత పెద్దది?

pandora papers | పండోరా పేపర్స్ .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది. ప్రపంచ దేశాధినేతలు, బడా బాబులు రహస్యంగా దాచిపెట్టిన సంపద చిట్టా గురించి పండోరా పేపర్స్ పేరుతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు బయటపెట్టారు. పండోరా పేపర్స్ అన్న పేరును గ్రీకు పురాణాల్లో ఉన్న పండోరా బాక్స్ నుంచి తీసుకున్నారు. గ్రీకు పురాణ కథల ప్రకారం.. పండోరా బాక్సు ఓ రహస్య బాక్సు. ఆ బాక్సును ఓపెన్ చేస్తే అనియంత్రిత దుష్టశక్తులు ఉంటాయని అర్థం. ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల డైరక్టర్ గెరార్డ్ రైల్ దీన్ని కూర్పు చేశారు. పండోరా పేపర్స్ పేరు పెట్టడానికి కారణం.. తాము వివిధ అంశాలకు చెందిన బాక్సును ఓపెన్ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
600 మంది జర్నలిస్టులు..
పండోరా పేపర్స్ లీక్ డేటాలో మొత్తం సుమారు 12 మిలియన్ల డాక్యుమెంట్లు ఉన్నాయి. రహస్యంగా దాచి పెట్టిన సంపద, పన్ను ఎగవేతలు, కొన్నింటిలో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న, శక్తివంతమైన నేతలు ఇలా చేశారని ఆ పేపర్స్‌లో లీక్ చేశారు. 117 దేశాలకు చెందిన 600 మంది జర్నలిస్టులు ఆ పేపర్స్‌ను స్టడీ చేస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఐసీఐజే ఈ డేటాను సేకరిస్తోంది.
64 లక్షల డాక్యుమెంట్లు.. 30 లక్షల ఇమేజ్‌లు
ప్రపంచవ్యాప్తంగా 140 మీడియా సంస్థలతో దీని గురించి అధ్యయనం చేస్తున్నారు. పండోరా పేపర్స్‌లో 64 లక్షల డాక్యుమెంట్లు, 30 లక్షల ఇమేజ్‌లు, పది లక్షల కన్నా ఎక్కువ ఈమెయిల్స్, 5 లక్షల కన్నా ఎక్కువ సంఖ్యలో స్ప్రెడ్ షీట్లు ఉన్నాయి.
ప్రముఖులు ఎవరెవరు ?
బ్రిటన్‌కు చెందిన టోరీ డోనర్ ఈ జాబితాలో ఉన్నారు. యూరోప్‌లో భారీ స్కామ్‌లకు ఆయన పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జోర్డాన్‌కు చెందిన చక్రవర్తి సుమారు 70 మిలియన్ల పౌండ్లతో అమెరికా, బ్రిటన్‌లో ప్రాపర్టీలు కొన్నట్లు ఆరోపించారు. అజార్బైజాన్కు చెందిన రాయల్ కుటుంబం సుమారు 400 మిలియన్ల పౌండ్లతో బ్రిటన్‌లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. చెక్ రిపబ్లిక్ ప్రధాని రెండు ఫ్రెంచ్ విల్లాలను 12 మిలియన్ల పౌండ్లకు కొనుగోలు చేశారు. కెన్యా అధ్యక్షుడు ఉరుహు కెన్యట్టా కూడా భారీగా దశాబ్దాల పాటు ఆఫ్‌షోర్ పెట్టుబడులు పెట్టారు. పండోరా పేపర్స్‌లో సుమారు 330 మంది రాజకీయవేత్తల సమాచారం ఉన్నది. తమ సంపదను రహస్యంగా ఎలా దాచారో ఆ డేటాలో లీక్ చేశారు. అమెరికాలోని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీకి చెందిన లక్ష్మీ కుమార్.. పండోరా పేపర్స్‌లోని విషయాలను వివరించారు. సంపన్నుల ఎలా తమ సంపదను రహస్యంగా విదేశాలకు మళ్లించి, ఎలా దాచిపెడుతారో చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?
Amazon Great Indian Festival : అమెజాన్ సేల్ లో రూ.2000 లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే
Rocketship treatment | వ్యాధులను తొందరగా తగ్గించేందుకు స్విమ్మింగ్ రోబోలతో చికిత్స
Lion Uses Public Toilet : పబ్లిక్ టాయిలెట్ ను యూజ్ చేసుకున్న సింహం.. వీడియో వైరల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

