e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News కోవిడ్‌తో ల‌క్షా 80 వేల‌ మంది హెల్త్‌వ‌ర్క‌ర్లు మృతి!

కోవిడ్‌తో ల‌క్షా 80 వేల‌ మంది హెల్త్‌వ‌ర్క‌ర్లు మృతి!

జెనీవా: హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌పై కోవిడ్ తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని, ఆ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు ల‌క్షా 80 వేల మంది హెల్త్‌వ‌ర్క‌ర్లు ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు తొలుత కోవిడ్ టీకాల‌ను ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ టీకాల పంపిణీలో జ‌రుగుతున్న అస‌మాన‌త‌ల‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఈ ఏడాది మే వ‌ర‌కు కోవిడ్‌పై పోరాటంలో హెల్త్‌వ‌ర్క‌ర్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కోవిడ్ టీకాల జాప్యం వ‌ల్ల క‌రోనా వ‌చ్చే ఏడాది కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మ‌రో డ‌బ్ల్యూహెచ్‌వో అధికారి తెలిపారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 135 మిలియ‌న్ల మంది హెల్త్ వ‌ర్క‌ర్లు ఉన్నారు. అయితే 119 దేశాల‌కు చెందిన డేటా ప్ర‌కారం.. ప్ర‌తి అయిదుగురిలో ఇద్ద‌రు మాత్ర‌మే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో ప‌ది మందిలో, ఒక హెల్త్‌వ‌ర్క‌ర్ మాత్ర‌మే వ్యాక్సినేట్ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక సంప‌న్న దేశాల్లో ప‌ది మందిలో.. 8 మంది టీకాలు వేయించుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవ‌లం 5 శాతం జ‌నాభా మాత్ర‌మే వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement