జెనీవా: మంకీపాక్స్ కేసులు విస్తరిస్తున్నాయి. దాదాపు 11 దేశాల్లో సుమారు 80 కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్రువీకరించింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా స్టడీ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కొన్ని దేశాల్లోని జంతు జనాభాలో ఆ వైరస్‌ను ఎండమిక్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దీని వల్ల స్థానికంగా ప్రజల్లో, టూరిస్టుల్లో ఆ వైరస్ సోకుతున్నట్లు చెప్పింది. మంకీపాక్స్ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. మరో 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ ఓ వైరల్ జూనోసిస్ అని, అంటే జంతువుల నుంచి మనుషులకు ఆ వైరస్ సోకుతుందని, గతంలో స్మాల్‌పాక్స్ రోగుల్లో కనిపించిన లక్షణాలే వీరిలో కనిపిస్తాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.