కోవిడ్‌పై నిర్ధిష్ట సమాచారం అందించండి.. చైనాను కోరిన డబ్ల్యూహెచ్ఓ
WHO | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని
జెనీవా: చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని ఆదేశించింది. వైరస్ బారినపడి దవాఖానల్లో చేరిన వారి సంఖ్య, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనా మరణాలు, టీకాలపై డాటాను పంచుకోవాలని చైనా ఆరోగ్య అధికారులకు సూచించింది. జీరో-కోవిడ్ పాలసీని ఎత్తివేసిన తర్వాత డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో జనాలు వైరస్ బారిన పడుతున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా చైనా.. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసులను వివరాలను వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్ఓ రియల్ టైమ్ డాటాను పంచుకోవాలని ఆదేశించింది.
కాగా, మహమ్మారి జూలు విదిల్చినప్పటికీ తక్కువ పరీక్షలు చేస్తుండటంతో అధికారిక కేసుల గణాంకాలు నమ్మదగినవి కావని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనది. జనవరి 3న జరగనున్న డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమావేశంలో వైరల్ సీక్వెన్సింగ్ పై డేటాను సమర్పించాలని చైనా శాస్త్రవేత్తలను కోరింది. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్‌పై చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సూచించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

