White House: వైట్‌హౌజ్‌లో దొరికిన కొకైన్..
White House: శ్వేతసౌధంలో కొకైన్ మాదకద్రవ్యాన్ని గుర్తించారు. ఇటీవల ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు పసికట్టారు. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ దొరికింది. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దాన్ని సీజ్ చేశారు.
వాషింగ్టన్ డీసీ: అమెరికా శ్వేతసౌధం(White House)లో కొకైన్ మాదకద్రవ్యాన్ని గుర్తించారు. ఇటీవల ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు పసికట్టారు. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ దొరికింది. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దాన్ని సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు. కొకైన్‌ను గుర్తించిన సమయంలో.. వైట్‌హౌజ్‌లో ప్రెసిడెంట్ బైడెన్ లేరు. ఆ సమయంలో ఆయన తన వీకెండ్‌ను క్యాంప్ డేవిడ్ లో గడుపుతున్నారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది ఆ తెల్లటి పౌడర్‌ను పరీక్షించారు. ప్రాథమిక పరీక్షలో ఆ పౌడర్ కొకైన్ అని తేలింది.
వైట్ పౌడర్ ప్యాకెట్‌ను మరింత టెస్టింగ్ కోసం పంపించారు. అయితే ఆ పౌడర్ ఎలా వైట్‌హౌజ్ లోకి ఎంటరైందన్న దానిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దర్యాప్తు చేస్తున్నారు. వైట్‌హౌజ్ వెస్ట్ వింగ్ అధ్యక్ష భవనానికి సమీపంలో ఉంటుంది. ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్, ప్రెస్ రూమ్‌లు కూడా అక్కడే ఉన్నాయి. అయితే వెస్ట్ వింగ్ వద్దకు ప్రతి రోజు పనుల కోసం వందల సంఖ్యలో జనం వస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

