Russia-Ukraine war | సాధ్యమైనంత మంది రష్యన్లను చంపాలని పశ్చిమ దేశాలు చెప్పాయి: ఉక్రెయిన్
Russia-Ukraine war | రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా సుదీర్ఘ యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయినా ఎక్కువ నష్టం మాత్రం ఉక్రెయిన్‌కే జరిగిందని చెప్పవచ్చు.
కీవ్: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా సుదీర్ఘ యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయినా ఎక్కువ నష్టం మాత్రం ఉక్రెయిన్‌కే జరిగిందని చెప్పవచ్చు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలు రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయి. సైనిక స్థావరాలు, సహజ వనరులు, కీలక కట్టడాలు విధ్వంసానికి గురయ్యాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యాతో యుద్ధం మొదలైన సమయంలో ‘వీలైనంత మంది రష్యన్లను చంపేయండని పశ్చిమ దేశాలు చెప్పనట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ఒక ప్రకటన చేశారు. యుద్ధం మొదలైన తర్వాత నాటో ఉక్రెయిన్‌కు దన్నుగా నిలువకముందు.. వీలైనంత మంది రష్యన్లను చంపేయాలని పశ్చిమ దేశాలు చెప్పినట్లు రెజ్నికోవ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, యుద్ధం జరుగుతున్న తీరును చూస్తే రష్యాపై పైచేయి సాధించడానికి పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ను పావుగా వాడుకున్నట్లు అర్థమవుతున్నది. పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ కేవలం 5 పట్టణాలను మాత్రమే తిరిగి తన అధీనంలో తెచ్చుకోగలిగింది. అందులో రెండు పట్టణాలపై రష్యా బలగాలు బాంబులు వేసి బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో ఈ సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ ఇక అలసిపోయినట్లే కనిపిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

