న్యూఢిల్లీ: ఎల్ నినో పరిస్థితులు మరితం బలపడనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. భూగోళం మండుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి వెదర్ వార్నింగ్ ఇచ్చింది. 1950 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న సంవత్సరంగా పేర్కొన్నది. యూఎన్‌కు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఓ వార్నింగ్ జారీ చేసింది. మానవ తప్పిదాలతో ప్రభావానికి గురవుతున్న వాతావరణానికి.. ఎల్ నినో తోడు కానున్నట్లు యూఎన్ పేర్కొన్నది. పసిఫిక్ సముద్రం నుంచి పెద్ద మొత్తంలో వేడి ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విభిన్నమైన వాతావరణం నెలకొంటుందని నిపుణులు తెలిపారు.
వెదర్ నిపుణుడు ర్యాన్ మావూ .. భూమికి చెందిన క్లైమెట్ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. భూగోళం మొత్తం ఎర్రగా మారినట్లు పేర్కొన్నారు. ఎల్ నినో గరిష్ట స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. అమెరికా మినహా అన్ని ప్రాంతాల్లో భూమి వేడెక్కుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2027 వరకు ఎల్ నినో ప్రభావం ఉంటుందని ప్రపంచ వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికను ఆయన అంగీకరించారు. మరో వాతావరణ నిపుణుడు జేకీ హౌజ్ఫాదర్ స్పందిస్తూ ఎల్‌నినో ప్రభావం వల్ల భూగోళంపై వాతావరణం 3.4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. మరో వెదర్ నిపుణులు లియోన్ సైమన్ స్పందిస్తూ.. సూపర్ డూపర్ ఎల్ నినో దశకు వెళ్తున్నట్లు తెలిపారు.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటున పెరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొన్నది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సెంట్రల్, ఈస్ట్రన్ పసిఫిక్ ప్రాంతాల్లో 3.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో పరిస్థితుల వల్ల జూన్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మరణాలు అధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు చిగాకో యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.
As forecasted 5 months ago, we’re going to need a bigger y-axis…
Super-duper El Niño it is… https://t.co/8X6FK2JTIK
— Leon Simons 🌍 (@LeonSimons8) September 30, 2026