హాంగ్‌కాంగ్: చైనాకు చెందిన మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్ చరిత్ర సృష్టించింది. స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి చైనా మహిళగా ఆమె గుర్తింపు పొందింది. వాంగ్ యాపింగ్ ఆదివారం స్పేస్‌వాక్ నిర్వహించింది. తియాన్‌గాంగ్ అంతరిక్ష కేంద్రంలో ప్రస్తుతం వాంగ్‌తో పాటు మరో వ్యోమగామి జాయి జిగాంగ్ ఉన్నారు. సోమవారం ఉదయం ఆ ఇద్దరూ సుమారు 6.5 గంటల పాటు స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఏ) ఈ విషయాన్ని తెలిపింది. షెంజూ-13లో వెళ్లిన మరో వ్యోమగామి యి గువాంగ్ఫూ మాత్రం స్పేస్‌స్టేషన్‌లో ఉండిపోయాడు. స్పేస్‌వాక్ సమయంలో వాంగ్.. స్టేషన్‌కు చెందిన రోబోటిక్ ఆర్మ్‌కు ఓ డివైస్‌ను అమర్చారు. సపోర్టింగ్ పరికరాల పనితీరును కూడా వాళ్లు పరీక్షించారు. స్పేస్‌స్టేషన్ నుంచి అడుగుబయటపెట్టిన వెంటనే.. ఆస్ట్రోనాట్ వాంగ్ చైనీయులకు గ్రీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాంగ్ యాపింగ్.. అంతరిక్ష కేంద్రానికి రెండవ చైనా మహిళ కాగా.. 2012లో లియూ యాంగ్ అనే మహిళా వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది.