Putin | రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్.. ఎన్నికలు బూటకమన్న పశ్చిమదేశాలు
గత 24 ఏండ్లుగా రష్యా అధ్యక్షుడిగా/ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ మరోసారి దేశ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అసమ్మతి గ ళాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పుతిన్.. బ లమైన ప్రత్యర్థులు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో 87 శాతం ఓట్ల సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 87 శాతం ఓట్లతో ఘన విజయం
- మరో ఆరేండ్లపాటు అధికారం
- పదవీకాలం పూర్తయితే అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డు
- శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Putin | మాస్కో, మార్చి 18: గత 24 ఏండ్లుగా రష్యా అధ్యక్షుడిగా/ప్రధానిగా అధికారంలో కొనసాగుతున్న పుతిన్ మరోసారి దేశ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అసమ్మతి గ ళాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పుతిన్.. బ లమైన ప్రత్యర్థులు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో 87 శాతం ఓట్ల సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో మరో ఆరేం డ్లు రష్యా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఈ పదవీ కాలం పూర్తయితే రష్యాను అత్యధిక కాలం పాలించిన నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. 1999 డిసెంబర్ నుంచి పుతిన్ రష్యా అధ్యక్షుడిగా లేదా ప్రధానిగా కొ నసాగుతున్నారు.
ఈ ఎన్నికలు బూటకమని పశ్చిమదేశాలు కొట్టివేశాయి. ఇవి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగిన ఎన్నికలు కావని, కఠినంగా నియంత్రించబడిన వాతావరణంలో జరిగిన ఎన్నికలని బ్రిటన్ విదేశాంగ కార్యద ర్శి పేర్కొన్నారు. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్లలో ఓటేయటానికి క్యూలో నించున్న ర ష్యన్లలో కొంత మంది తాము నిరసనలో పా ల్గొంటున్నట్టు మీడియాతో చెప్పారు. మాస్కోలోని ఓ ఓటర్ తాను మార్పును కోరుకుంటున్నాను అని.. కాకపోతే అది సాధ్యం కాదని చెప్పాడు. అందరిలాగే అతను కూడా తన పే రు, పూర్తి వివరాలు ఇవ్వటానికి జంకాడు.
అలాగైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు
అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూ టమికి, రష్యాకు మధ్య వివాదం చెలరేగితే అ ది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంద ని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచం కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నదని హెచ్చరించా రు. అలాంటి స్థితిని ఎవరూ కోరుకోవడం లే దని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సా ధించాక పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో దళా లు, రష్యా మధ్య యుద్ధం పొంచి ఉన్నదని ఇ టీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మా క్రాన్ చేసిన కామెంట్‌కు స్పందనగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎవరికీ భయపడదని పేర్కొన్నారు.
తనకు మద్దతుగా నిలిచిన దేశ పౌరులందరికీ ధన్యవాదాలు చెప్తూ.. ర ష్యాను లొంగదీసుకోవడం ఎవరి వల్లా కాద ని ఇప్పటికే చరిత్ర చెబుతున్నదని అన్నారు. వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఎవరూ రష్యా సంకల్పాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు. అలాగే ఇటీవలే అనుమానాస్పద స్థి తిలో మరణించిన తన బద్ధ విరోధి నావల్నీ మృతిపై పుతిన్ విచారం వ్యక్తం చేశారు. ఖైదీల మార్పిడి కింద అతడిని విడుదల చేయాలనుకున్నట్టు చెప్పారు. నావల్నీని అప్పగించి, పా శ్చాత్య దేశాల్లో ఉన్న కొందరిని రష్యాకు తీసుకొద్దామని అనుకున్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

