Viral Video | 7 అడుగులు.. 250 కిలోలు.. మత్స్యకారునికి చిక్కిన భారీ షార్క్
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్( Viral Video )గా మారింది. ఈ భారీ షార్క్.. అతని పడవకు దగ్గరగా వచ్చి వెళ్తుండటం ఆ వీడియోలో చూడొచ్చు.

లండన్: యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఓ మత్స్యకారుడు రికార్డు బ్రేక్ చేశాడు. 7 అడుగుల పొడవు, 250 కిలోలు ఉన్న ఓ భారీ షార్క్‌ను పట్టుకున్నాడు. డెవోన్ తీరంలో చేపల వేటకు వెళ్లిన సిమోన్ డేవిడ్సన్ అనే మత్స్యకారుడికి ఈ భారీ చేప చిక్కింది. గంటపాటు చెమటోడ్చిన అతడు దానిని పడవలోకి లాగగలిగాడు. ఆ తర్వాత మరో ఐదుగురు కలిసి దానిని తిరిగి సముద్రంలోకి వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్( Viral Video )గా మారింది. ఈ భారీ షార్క్.. అతని పడవకు దగ్గరగా వచ్చి వెళ్తుండటం ఆ వీడియోలో చూడొచ్చు.
1993లో ఓ మత్స్యకారుడికి 229 కిలోల షార్క్ దొరకగా.. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయింది. తన ఎరను అందుకున్నది ఓ భారీ షార్క్ అని తనకు ముందు తెలియలేదని డేవిడ్సన్ అన్నాడు. దానిని పడవలోకి ఎలాగోలా లాగిన తర్వాత అది రాక్షస చేప అని తెలిసిందని చెప్పాడు. గంట పాటు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, కాళ్లు, చేతులు వణికిపోయాయని అతడు తెలిపాడు. దానిని పడవలోకి తీసుకున్న తర్వాత షార్క్ కొలతలు తీసుకొని తిరిగి సముద్రంలోకి వదిలేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

