Venezuela | వెనిజులా భూకంపం.. 3,000కు చేరిన మృతుల సంఖ్య.. వారం రోజులపాటు సంతాపదినాలు
Venezuela : వెనిజులా భూకంపం ఆ దేశానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. గత నెలలో సంభవించిన రెండు వరుస భూకంపాల వల్ల దాదాపు 3,000 మంది మరణించినట్లు అంచనా. ఇప్పటికే 2,954 మందికిపైగా మృతదేహాల్ని సహాయక బృందాలు వెలికితీశాయి. మరోవైపు సహాయక చర్యలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి.
Venezuela : వెనిజులా భూకంపం ఆ దేశానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. గత నెలలో సంభవించిన రెండు వరుస భూకంపాల వల్ల దాదాపు 3,000 మంది మరణించినట్లు అంచనా. ఇప్పటికే 2,954 మందికిపైగా మృతదేహాల్ని సహాయక బృందాలు వెలికితీశాయి. మరోవైపు సహాయక చర్యలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా విదేశీ సహాయక బృందాలు వెనిజువెలాను వీడుతున్నాయి. గత జూన్ 24న వెనిజులాలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. దక్షిణ కరాకస్ ప్రాంతంలో 7.2 తీవ్రతతో ఒక భూకంపం, 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించాయి. దీంతో అనేక బిల్డింగులు సహా నిర్మాణాలు నేలకూలాయి.
ఈ ఘటనలో ఇప్పటివరకు 2,954 మంది మరణించారు. దాదాపు 16,500 మంది గాయపడ్డారు. ఇంకా బాధితుల వెలికితీత, శిథిలాల తొలగింపు వంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ చాలా చోట్ల సహాయక చర్యలు ఆగిపోయాయి. అలాగే వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన సహాయక బృందాలు తమ సహాయక చర్యల్ని ఆపేస్తున్నాయి. వెనిజులా వీడేందుకు సిద్ధమయ్యాయి. భూకంపం సంభవించిన తర్వాత మొదటి 72 గంటల రెస్క్యూ విండో పీరియడ్ చాలా కీలకం. ఈ సమయంలో చేపట్టే రెస్క్యూ ఆపరేషన్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుందని అంచనా. 72 గంటల్లో ఎక్కువ మందిని బతికించడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తాయి. అయితే, భూకంపం సంభవించి దాదాపు 9 రోజులు కావడంతో సహాయక చర్యల్ని నెమ్మదిగా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో బాధితులు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువ. అందుకే కొన్ని సహాయక బృందాలు తమ ఆపరేషన్స్ నిలిపివేశాయి.
అయితే, ఇంకా కొన్ని చోట్ల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ శిథిలాల కింద నుంచి ఒకరిద్దరు ప్రాణాలతో బయటపడుతున్న ఘటనలున్నాయి. వేల మంది క్షతగాత్రుల్ని అధికారులు స్తానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా వేలమంది ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం.. 50,000 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. భారీ ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో వెనిజులా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారం రోజులపాటు భూకంప మృతులకు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక, భూకంపం సంభవించినప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ 942సార్లు భూప్రకంపనలు వచ్చాయని అక్కడి అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

