పశ్చిమ దేశాలవి పసలేని ఆరోపణలు.. పైప్‌లైన్ ఆపడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ధ్వజం
యూరప్ వెళ్లే సహజ వాయువు పైప్‌లైన్‌ను రష్యా నిలిపివేయడంపై పశ్చిమ దేశాలు మండి పడుతున్నాయి. ఎనర్జీని కూడా ఆయుధంలా రష్యా ఉపయోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నాయి. వీటిపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించాడు. ‘‘ఎనర్జీని కూడా ఆయుధంలా వాడుకుంటోందని రష్యాను ఆడిపోసుకుంటున్నారు.
అవన్నీ పసలేని ఆరోపణలే. ఏం ఆయుధాలు వాడుతున్నాం? ఎన్ని రిక్వెస్టులు వస్తే అంత సప్లై ఇస్తున్నాం కదా’ అని పుతిన్ అన్నారు. అలాగే మరమ్మతుల కారణంగా రష్యాకు చెందిన ప్రముఖ గ్యాస్ కంపెనీ గాజ్‌ప్రామ్.. నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను నిలిపివేయడం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ రిపేరులకు అవసరమైన సీమెన్స్ టర్బైన్లు రష్యాకు చేరడం లేదని, దీనికి కారణం యూరప్ దేశాల ఆంక్షలేనని పుతిన్ వివరించారు.
‘మాకు టర్బైన్ ఇవ్వండి తెల్లారే నార్ట్ స్ట్రీమ్ ప్రారంభిస్తాం. ఒక్క బటన్ నొక్కితే చాలు. కానీ ఆంక్షలు విధించి టర్బైన్ రాకుండా అడ్డుకుంది మేం కాదు’ అని స్పష్టంచేశారు. అలాగే రష్యన్ సహజ వాయువుపై ధర పరిమితి గురించి మాట్లాడుతూ.. అదొక నాన్-మార్కెట్ పరిష్కారమని, దానికి ఎలాంటి విలువా ఉండదని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

