ఈ వారమే ఇరాన్ దాడి చేయొచ్చు
ఇజ్రాయెల్‌పై ఈ వారంలోనే ఇరాన్ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొన్నది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బి కీలక ప్రకటన చేశారు.
- ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్, ఆగస్టు 13: ఇజ్రాయెల్‌పై ఈ వారంలోనే ఇరాన్ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొన్నది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బి కీలక ప్రకటన చేశారు. జూలై 31న టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హనియా హత్య, లెబనాన్‌లో హెజ్బొల్లా సీనియర్ కమాండర్ ఫౌడ్ షుక్‌న్రు ఇజ్రాయెల్ హతమార్చడంతో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే.
తమ భూభాగంలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు పాల్పడటంపై ఇరాన్ భగ్గుమంటున్నది. ఈ నేపథ్యంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాధినేతలు ఉద్రిక్తతలను చల్లార్చి, ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు సహకరించాలని ఇరాన్‌ను కోరినా సానుకూల స్పందన రాలేదు.
టెల్ అవీవ్ లక్ష్యంగా హమాస్ రాకెట్ల దాడి
ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా హమాస్ మంగళవారం దాడికి పాల్పడింది. రెండు ఎం90 రాకెట్లను ప్రయోగించింది. అయితే, ఒక రాకెట్ పేలుడు శబ్దం నగరంలో వినిపించిందని, ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక మీడియా తెలిపింది. ఇంకో రాకెట్ మాత్రం ఇజ్రాయెల్ భూభాగంలోకి చేరుకోలేదని పేర్కొన్నది. కాగా, మంగళవారం గాజా స్ట్రిప్‌లోని దక్షిణ, మధ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వైమానికదాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 19 మంది పాలస్తీనా ప్రజలు మరణించినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Iran Attack
- Israel
- John Kirby
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

