రష్యాకు చైనా సాయం చేస్తే.. తీవ్ర పరిణామాలే: అమెరికా
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన మిత్రదేశమైన చైనా సాయాన్ని కోరింది. సైనికంగా, ఆర్థికంగా ఆదుకోవాలని చైనాను రష్యా వేడుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా వార్నింగ్ జారీ చేసింది. ఒకవేళ రష్యాకు చైనా సహకరిస్తే, అప్పుడు ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఉక్రెయిన్పై దాడికి దిగిన తర్వాత చైనా సైనిక సహాయాన్ని రష్యా కోరినట్లు చాలా వార్తా సంస్థలు నివేదికలు ప్రచురించాయి. అయితే ఇలాంటి అభ్యర్థన గురించి తమకు సమాచారం లేదని వాషింగ్టన్లోని చైనా ఎంబసీ తెలిపింది. ఇవాళ రోమ్ నగరంలో అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారింది. వాస్తవానికి ఉక్రెయిన్పై దాడి మొదలైన తర్వాత రష్యాకు చైనా మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ డ్రాగన్ దేశం సైనిక, ఆర్థిక సాయాన్ని అందించినట్లు మాత్రం సమాచారంలేదు. తమకు డ్రోన్లు కావాలంటూ చైనాను రష్యా కోరినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- consequences
- Russia
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

