తాలిబన్లకు షాకిచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌కు పెండింగ్‌లో ఉన్న లేదా పంపిణీ చేయని ఆయుధాల బదిలీని సమీక్షిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో రక్షణ కాంట్రాక్టర్లకు తెలిపింది. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో వారి అనుకూలతను నిర్ణయించడానికి పెండింగ్‌లో ఉన్న ఆయుధాల ఎగుమతి లైసెన్స్‌లు, ఇతర ఆమోదాలను డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్స్ సమీక్షిస్తున్నాయి’ అని ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ పరికరాల ఎగుమతిదారులకు దీనిపై అప్డేట్ను రాబోయే రోజుల్లో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ జారీ చేస్తుందని అందులో పేర్కొంది.
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో అష్రఫ్ ఘనీ పరిపాలన పతనం నేపథ్యంలో తాలిబన్లు అమెరికాకు చెందిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ-29 సూపర్ టుకానో అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్, మైన్-రెసిస్టెంట్ హమ్వీస్‌తో పాటు అమెరికా తయారీ ఎం4 కార్బైన్లు, ఎం 6 రైఫిల్స్ ఇందులో ఉన్నట్లు సమాచారం. 2020 వరకు ఆఫ్ఘనిస్థాన్‌కు 227 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా అమ్మినట్లు డేటా ద్వారా తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
KTR | తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

